‘కాంగ్రెస్‌, టిడిపిలకు భంగపాటు తప్పదు'

అనంతపురం :

సహకార సంఘాల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టిడిపి కలిసికట్టుగా పోటీచేసినా వాటికి భంగపాటు తప్పదని పార్టీ అనంతపురం జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కొండూరు వేణుగోపాలరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 31న జరిగే ‌సహకార సంఘాల ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ విజయ దుందుభి మోగించడం ఖాయమని ఆయన అన్నారు. సోమఘట్ట, రొద్దంవారిపల్లికి చెందిన పలువురు టిడిపి కార్యకర్తలు మండల నాయకుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైయస్‌ఆర్‌సిపిలో చేరారు. గుట్ట లక్ష్మినరసింహస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో వారిని నాయకులు పార్టీ కండువాలు పార్టీ వేసి ఆహ్వానించారు. అంతకు ముందు శ్రీ వైయస్.జగ‌న్మోహన్‌రెడ్డికి బెయి‌ల్ రావాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సోమఘట్ట పంచాయతీలోని పలు గ్రామాల మీదుగా వందలాది మంది కార్యకర్తలు మోటార్ ‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

దేవరింటిపల్లి వాసుల చేరిక :
నల్లచెరువు మండలంలోని దేవరింటిపల్లికి చెందిన కాంగ్రెస్, ‌టిడిపి కార్యకర్తలు బుధవారం వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. స్థానిక గీతా మందిరంలో నిర్వహించిన వై‌యస్‌ఆర్‌సిపి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, వైయస్‌ఆర్‌సిపి నాయకుడు జొన్నా రామయ్య ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. మున్సిపల్ మాజీ చై‌ర్పర్స‌న్ వేమల ఫర్హానా ఫయా‌జ్, నాయకులు ‌కె.ఎం. బాషా, ఫయాజ్‌ బాషా వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.

Back to Top