'కాంగ్రెస్, టీడీపీలవి నీచ రాజకీయాలు'

కదిరి:

అధికార కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జతకట్టి నీచ రాజకీయాలు చేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి విమర్శించారు. ఆయన సహకార ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ మద్దతుదారుల తరఫున అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్లలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు చిదంబరరెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు మాత్రం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పోలింగ్ రోజు అవసరమైతే తాను కూడా వస్తానన్నారు. సహకార ఎన్నికల్లో వైయస్ఆర్‌ సీపీ సత్తా చూపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ నేత ఇస్మాయిల్ మాట్లాడుతూ సహకార ఎన్నికల్లో కదిరి రూరల్ పరిధిలోని గొల్లోల్లచెరువు సొసైటీ ఏకగ్రీవంతో వైయస్ఆర్‌ సీపీ బోణి కొట్టిందన్నారు. నామినేషన్ల ఉపసంహరణ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి, తమ మద్దతుదారులను వేధింపులకు గురి చేసిందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా నియోజకవర్గంలోని పది సొసైటీల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Back to Top