కాంగ్రెస్‌, టీడీపీలకు డిపాజిట్లు దక్కవు: పెద్దిరెడ్డి

హైదరాబాద్, 18 ఏప్రిల్ 2013:

తనపై వెంటనే అనర్హత వేటు వేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరారు. విప్‌ ధిక్కారణపై స్పీకర్‌కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.  ఉప ఎన్నికలు వెంటనే నిర్వహిస్తే అన్నిస్థానాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. చిత్తూరులో మొత్తం 14అసెంబ్లీ స్థానాలకు 13 స్థానాలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌వేనని ఆయన దీమా వ్యక్తం చేశారు.

Back to Top