కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి

రాజానగరం, 07 జూన్ 2013:

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగుతోంది.  ఆమె శుక్రవారం సాయంత్రం తొకడ గ్రామానికి చేరే సమయానికి భారీ వర్షం ప్రారంభమైంది. అంత వర్షంలోనూ ఆమె ముందుగా నిర్ణయించిన ప్రకారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. రచ్చబండ కార్యక్రమంలో స్థానికులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న శ్రీమతి షర్మిల వారికి త్వరలో రాజన్న రాజ్యం వస్తుందనీ.. అందరి కష్టాలూ తీరతాయనీ భరోసా ఇచ్చారు.
వైయస్ సీయంగా ఉన్న సమయంలో గ్యాస్, విద్యుత్తు సహా వేటి ధరలూ పెరగలేదున్నారు. కిరణ్ సర్కారులో అన్ని చార్జీలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. అప్పటి చంద్రబాబు, ఇప్పుడు కిరణ్ పాలనలో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. జగనన్నను సీఎం చేయాలని కోరారు. జగనన్న సీఎం అయితే రాజన్న సంక్షేమ పథకాలకు జీవం పోస్తారని శ్రీమతి  హామీ ఇచ్చారు.

Back to Top