6న స్పీక‌ర్‌ను క‌లువ‌నున్న ఎంపీలు


అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఈ నెల 6వ తేదీ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలువనున్నారు. బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా ఏప్రిల్‌ 6న స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎంపీలు రాజీనామాలు చేశారు. గ‌త నెల 29న ఎంపీలు స్పీక‌ర్‌ను క‌లిసి త‌మ రాజీనామాలు ఆమోదించాల‌ని కోరారు. అయినా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో మ‌రోమారు స్పీక‌ర్‌ను క‌లువ‌నున్నారు.  ఎంపీలు మాట్లాడుతూ..రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం దేనికైనా సిద్ధం. టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడానికి చంద్రబాబుకు భయం. ఉపఎన్నికలంటే జంకుతున్నారు. ఓటుకు నోటు కేసు, ఆర్థిక అవకతవకల కేసులతో చంద్రబాబుకు వణుకుపుడుతోంది. వైయ‌స్‌ జగన్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. రాహుల్ గాంధీతో కలవడానికైనా, మళ్ళీ మోదీతో జతకట్టడానికైనా బాబు వెనుకాడరు. చంద్రబాబు విలువలు లేని పచ్చి అవకాశవాదని మండిపడుతున్నారు. తమ వైఖరీలో ఎలాంటి మార్పు ఉండదని ఎంపీలు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని ఎంపీలు వెల్లడించారు. 
 

 
Back to Top