పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రేణుల సంబరాలు

హైదరాబాద్, 23 జూలై 2013:

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జరిగిన మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానా‌ల్లో విజయదుందుభి మోగించడంతో పార్టీ నాయకులు, శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కేంద్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. జై జగన్ నినాదా‌లతో కార్యాలయం ఆవరణ మారుమోగింది. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా వైయస్ఆర్‌ కాంగ్రెస్ ‌పార్టీ తన ఆధిక్యతను చాటుకోవడం తథ్యమని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top