నేటితో ముగియనున్న మేల్కొలుపు పాదయాత్ర

అనంతపురం: కరువు పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే డిమాండ్‌తో శింగనమల నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేల్కొలుపు పాదయాత్ర నేటితో ముగియనుంది. ప్రభుత్వం పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆమె విజయవంతంగా తొమ్మిది రోజుల పాటు పూర్తి చేశారు. శింగనమల నియోజకవర్గం ఎల్లనూరులో దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డికి పూలమాల వేసి నివాళులర్పించిన లాంచనంగా ప్రారంభమైన పాదయాత్ర నేడు భూదేడు నుంచి గార్లదిన్నె వరకు కొనసాగనుంది. సాయంత్రం గార్లదిన్నెలో బహిరంగసభ నిర్వహించనున్నారు. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టిలేపేందుకు, ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు సుమారు 150 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.

Back to Top