యనమల నోటిని ఫినాయిల్‌తో శుభ్రం చేసుకో

విజయవాడ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడించి టీడీపీ నేతలేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. వెనుక నుంచి చంద్రబాబు ముందు నుంచి యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యనమల నోటిని ఫినాయిల్‌తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. గతంలో స్పీకర్‌ కుర్చీకే మచ్చ తెచ్చాడని, యనమల వైఖరికి ఎన్టీఆర్‌ కంటతడి పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలతో ఆనాడు ఎన్టీఆర్‌ అసెంబ్లీకి దూరంగా ఉన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు ఆగడాలను నిరసిస్తూ అనైతిక రాజకీయాలకు వ్యతిరేకంగా నడుస్తున్నామని చెప్పారు. 

Back to Top