జన సంతకం.. పోటెత్తిన అభిమానం

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వై.యస్.జగన్మోహన్‌ రెడ్డి అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ చేపట్టిన 'జగన్ కోసం జన సంతకం' కార్యక్రమానికి రోజురోజుకూ ప్రజల మద్దతు పెరుగుతోంది. సీబీఐ కుట్రలను నిరసిస్తూ సాగిస్తున్న ఈ  కార్యక్రమానికి కొత్త సంవత్సరం తొలి రోజున జనం వెల్లువలా తరలివచ్చారు. రాష్ట్రపతికి సమర్పించబోయే కోటి సంతకాల కార్యక్రమంలో తామూ భాగస్వాములవుతామంటూ స్వచ్ఛందంగా తరలివచ్చారు.  ఏడు నెలలుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నందున ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్న పార్టీ శ్రేణులు మంగళవారం పరస్పర అభినందనలకు పరిమితమయ్యారు. అనంతరం సంతకాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకూ.. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ జనం వద్దకు పార్టీ కార్యకర్తలు తరలి వెళ్ళారు. పలు ప్రాంతాల్లో సంతకాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. బస్సు లు, కార్లు, లారీల చోదకులు, ఆటోవాలాలు సంతకాలు చేసేందుకు ముందుకొచ్చారు. కళాశాల విద్యార్థులు, ఇతర యువకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి విడుదల కావాలని కోరుతూ నినదించారు. అనేక చోట్ల మహిళలు గుంపులుగా వచ్చి సంతకాలు చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి బయ ట ఉంటే తమకు రాజకీయ మనుగడ లేదని భావిస్తున్న కాంగ్రెస్, టీడీపీల కుట్రలను ఛేదించాలని ఈ సందర్భంగా వారు కోరారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధానికి నిరసనగా రాష్ట్రంలో సాగుతున్న సంతకాల సేకరణ విషయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విన్నవించినట్లు పార్టీ బాపట్ల నేత కోన రఘుపతి తెలిపారు. డిసెంబర్ 28న రాష్ట్రపతిని తాను కలిశాననన్నారు. తన తండ్రి కోన ప్రభాకరరావు గవర్నర్‌గా పనిచేసిన సమయంలోని విషయాలను రాష్ట్రపతి జ్ఞప్తికి తెచ్చుకున్నారన్నారు.

Back to Top