<strong>శ్రీకాకుళం :</strong> ‘జగన్ కోసం.. జనం సంతకం’ పత్రాలను వెంటనే తనకు అందజేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా కమిటి కన్వీనర్ ధర్మాన పద్మప్రియ కోరారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రపతికి అందజేసేందుకు పార్టీ కోటి సంతకాల సేకరణను చేస్తోంది. ఈ క్రమంలో శనివారంనాడు శ్రీకాకుళంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్ కూడలి వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.<br/>ఈ సందర్భంగా పద్మప్రియ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు చేపట్టిన సంతకాల సేకరణ పత్రాలు అన్నింటినీ తనకు అందజేయాలన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేకే టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు పన్ని సిబిఐని అడ్డుపెట్టుకుని జైల్లో పెట్టాయని దుయ్యబట్టారు. ప్రజలంతా ఈ కుట్రలను గమనిస్తున్నారు కాబట్టే స్వచ్ఛందంగా వచ్చి శ్రీ జగన్మోహన్‌రెడ్డి విడుదలను కోరుతూ సంతకాలు చేస్తున్నారన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే విడుదలవడం ఖాయమన్నారు. ఆయన నాయకత్వాన్ని ప్రజలంతా కోరుకుంటున్నారని, తప్పక ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.