తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం (జులై 15) భీమవరం, కిర్లంపూడిలో పర్యటించనున్నారు. ముందుగా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమై వారి సమస్యలు, ఫీడ్ ధరల పెంపు, గిట్టుబాటు ధరలు, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించనున్నారు. అనంతరం కిర్లంపూడికి వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు. పర్యటన ముఖ్యాంశాలు: ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమై వారి సమస్యలు, ఫీడ్ ధరల పెంపు, గిట్టుబాటు ధరలు తదితర అంశాలపై చర్చిస్తారు. మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు భీమవరం నుంచి హెలికాప్టర్‌లో జగ్గంపేటకు చేరుకుంటారు. జగ్గంపేట నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి ప్రయాణిస్తారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళులర్పిస్తారు. ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు.