రేపు భీమవరానికి వైయస్ జగన్ 

ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్న మాజీ ముఖ్యమంత్రి

ఫీడ్ ధరల పెంపు, గిట్టుబాటు ధరల లేమిపై రైతులతో ముఖాముఖి

తాడేపల్లి: రాష్ట్రంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (15.07.2026) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటనకు వెళ్లనున్నారు. పెరుగుతున్న ఆక్వా ఫీడ్ ధరలు, గిట్టుబాటు ధరల లేమి, అధిక ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీల భారం, ఎగుమతుల్లో ఎదురవుతున్న సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను తెలుసుకుని భరోసా ఇవ్వనున్నారు. రైతుల ఆవేదనను నేరుగా విని, వారి సమస్యల పరిష్కారం కోసం వైయ‌స్ఆర్‌సీపీ తరఫున పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలియజేయనున్నారు.

 పర్యటనలో రైతులతో ముఖాముఖి 

భీమవరం చేరుకున్న అనంతరం ఉండి బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సభావేదిక వద్ద ఆక్వా రైతులతో శ్రీ వైయస్ జగన్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వ విధానాల ప్రభావంపై నేరుగా రైతులతో చర్చించనున్నారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు వరుసగా ధరలు పెంచడంతో రైతులపై పడుతున్న అదనపు భారం, పెట్టుబడులు పెరిగినా రొయ్యలు, చేపలకు గిట్టుబాటు ధరలు లేక నష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితిపై రైతుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఎగుమతుల్లో తలెత్తుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై కూడా రైతులతో విస్తృతంగా చర్చించనున్నారు.

రైతులకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ

ఆక్వా రైతులను పరామర్శించి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రైతులకు న్యాయం జరిగే వరకు  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని శ్రీ వైయస్ జగన్ భరోసా ఇవ్వనున్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైన అన్ని స్థాయిల్లో పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేయనున్నారు.

 పర్యటన షెడ్యూల్ 

* ఉదయం  10.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు.
* భీమవరం చేరుకుని  ఉండి బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సభావేదిక వద్ద ఆక్వా రైతులతో సమావేశమవుతారు.
* ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభం, ఫీడ్ ధరల పెంపు, గిట్టుబాటు ధరల లేమి, రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై చర్చిస్తారు.
* కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.

Back to Top