జనం సంక్షేమానికే జగన్ తాపత్రయం: శోభా

కర్నూలు : కాంగ్రెస్‌. టిడిపిల కుట్రల కారణంగా ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధంలో ఉన్నప్పటికీ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ప్రజల సంక్షేమం కోసమే తాపత్రయ పడుతున్నారని పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో శుక్రవారంనాడు సహకార సంఘం అధ్యక్షుని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఇప్పటికి మూడు సార్లు కలిశానని, ఎప్పుడు కలిసినా ఆయన ప్రజల గురించే ఆలోచిస్తూ ఆరా తీశారన్నారు.

దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖ‌రరెడ్డి రైతులకు అండగా ఉండి వారి కష్టాలు తీర్చేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని శోభా నాగిరెడ్డి గుర్తుచేశారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. విద్యుత్ చార్జీలు ఇష్టానుసారంగా పెంచుతుండటంతో ఎస్సీ, ఎస్టీ, మధ్యతరగతి కుటుంబాలు నెలసరి విద్యు‌త్ బిల్లులు చెల్లించేందుకు అష్టకష్టాలు పడుతున్నాయని ‌ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సహకార సంఘాల ఎన్నికల్లో మద్దతుదారులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు ‌తొక్కిందని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం సహకార సంఘాల్లో వైయస్‌ఆర్‌సిపి మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని దుయ్యబట్టారు.
Back to Top