జ‌ల జాగ‌ర‌ణ విజ‌య‌వంతం

బెళుగుప్ప :  తాగు, సాగునీటి అవ‌స‌రాల కోసం ఉద్దేశించిన జ‌ల జాగ‌ర‌ణ విజ‌య‌వంతం అయింది. అనంతపురం జిల్లా బెళుగుప్పలో శనివారం సాయంత్రం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ప్రారంభించిన జల జాగరణ దీక్ష ఆదివారం  ముగిసింది. హంద్రీనీవా మొదటి దశ ఆయకట్టుకు నీరు అందించాలని, జాడిపల్లె గ్రామస్తులకు పునారావాసం కల్పించాలని, జీవో నంబర్ 22ను రద్దు చేయాలన్న డిమాండ్లతో ఆయన ఈ జాగరణ దీక్ష నిర్వహించారు.పలువురు పార్టీ నాయకులు ఆయన చేపట్టిన జాగరణ దీక్షకు మద్దతు తెలిపారు. 

To read this article in English:   http://bit.ly/1WUoo3H 

Back to Top