షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని వెద్యులు వెల్లడిస్పందించని అధికారులు..
తూర్పుగోదావరిః రైతు ప్రయోజనాలను కాపాడటంలో ప్రబుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, పురుషోత్త పట్నం ఎత్తిపోతల పథకం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైయస్ ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షులు జక్కం పూడి రాజా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురువారానికి మూడో రోజుకు చేరుకుంది. సీతానగరం మండలం రఘుదేవపురంలో వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం నేత జక్కంపూడి రాజా చేపట్టిన ఆమరణ దీక్ష చేపట్టారు. ఉదయం ఆయనకు పరీక్షలు చేసిన డాక్టర్లు షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని వెల్లడించారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలంటూ అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా అధికారుల్లో కదలిక రాకపోవడంతో, వారికి న్యాయం జరిగేంత వరకు తాను పోరాటం చేస్తానని రాజా స్పష్టం చేశారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వల్ల భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించాలని, వరికుప్పులు కాలిపోయిన రైతులను ఆదుకోవాలని, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పోలవరం జలవిద్యుత్ కేంద్రం సిబ్బంది కాలనీకి భూసేకరణలో ఉన్న రైతుల ఆవేదన పరిగణనలోకి తీసుకోవాల ని డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. వైయస్‌ఆర్‌సీపీ ఉభయ గోదావరి జిల్లాల పరిశీలకులు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, కుడిపూడి చిట్టబ్బాయ్, చెల్లుబోయిన శ్రీను, కురుముల రాంబాబు, చెల్లుబోయిన వేణుగోపాల్, కొల్లి నిర్మల,మేడపాటి షర్మిలా రెడ్డి, తోట సుబ్బారావు నాయుడు, నక్కా రాజబాబు, గిరిజాల బాబు, రాయపాటి తదితరులు కూడా శిబిరం వద్దకు వచ్చి దీక్షకు మద్ధకు పలికారు.