మీ వాడు ఎంత పప్పో, నీవు ఎంత నిప్పో అందరికీ తెలుసు..?

గుంటూరుః చంద్రబాబు మాటలు నమ్మి అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. రైతులను కష్టాల నుంచి గట్టెక్కించగల ఏకైక నాయకుడు వైయస్ జగన్ అని పేర్కొన్నారు. ఇతక పార్టీల నాయకులను కొంటూ, ప్రజావాణి వినిపించకుండా చేయాలన్న ఆలోచనతో బాబు పన్నిన కుట్రకు ప్రజలు చెప్పుతో సమాధానం చెప్పేరోజు వస్తుందన్నారు.  రైతుల మేలు కోసం పరితపించిన నాయకుడు మహానేత వైయస్ఆర్ అని కొనియాడారు. తాను వస్తూనే కరువు తీసుకువచ్చిన ఘనడు చంద్రబాబని ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం ప్రాజెక్ట్ ల వ్యయాలు ఇష్టారాజ్యంగా పెంచుతూ బాబు ప్రజాధనాన్ని దోచేస్తున్నాడని జగ్గిరెడ్డి నిప్పులు చెరిగారు.

బాబు పాలనలో  రైతులు, మహిళలు ఏ ఒక్కరూ సంతోషంగా లేరని జగ్గిరెడ్డి అన్నారు. బాబు తప్పుడు ఆలోచనలకు కొట్టుకుపోకుండా తలవంచి పోరాడుతున్న నాయకుడు వైయస్ జగన్ అని అన్నారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే, జగన్ అంటే భయం లేకుంటే... అసెంబ్లీ పెట్టే దమ్ముందా మీకుందా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. జయంతికి, వర్థంతికి కూడా తేడా తెలియని పండిత పుత్ర పరమశుంట లోకేష్ అని ఎద్దేవా చేశారు. మీవాడు ఎంత పప్పో, మీరు ఎంత నిప్పో ఓటుకు కోట్లు కేసు ద్వారా ప్రజలకు తెలిసిందన్న సంగతి గ్రహించాలని బాబుకు హితవు పలికారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top