నెల్లూరు: వైయస్ఆర్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో వైయస్ఆర్‌సీపీ నేతల్ని వేధింపులకు గురి చేస్తోంది. నెల్లూరుకు చెందిన వైయస్ఆర్‌సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. జూలై 21న బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు నెల్లూరు పోలీసులు. పోలీసుల తీరుపై శ్రీకాంత్‌రెడ్డి భార్య ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఏ సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని, సాయంత్రం గం. 4.15 ని.లకు అరెస్ట్ చేశామని మెసేజ్ పెట్టారని విమర్శించారు. పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో శ్రీకాంత్‌రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిన్న( సోమవారం, జూలై 21) అరెస్టైన వైయస్ఆర్‌సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అర్థరాత్రి సమయంలో ఆయన్ని హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ అధీనంలో ఉన్న సమయంలో శ్రీకాంత్‌రెడ్డి అస్వస్థతకు లోనయ్యారు. పోలీసుల అదుపులో ఉండగా శ్రీకాంత్‌రెడ్డిని ఆస్పత్రిలో చేర్చడంతో వైయస్ఆర్‌సీపీలో ఆందోళన నెలకొంది.