ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ హేయమైన చర్య

చింతలపూడి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ కంభం విజయరాజు

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా: ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ హేయమైన చర్య అని, ఇది కూటమి ప్రభుత్వ కుట్రపూరిత, కక్షపూరిత రాజకీయంలో భాగమేనని చింతలపూడి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ కంభం విజయరాజు మండిప‌డ్డారు. మిథున్ రెడ్డి  అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ జంగారెడ్డిగూడెంలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు  నిరసన కార్యక్రమం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌రాజు మాట్లాడుతూ.. ‘అక్రమ మద్యం కేసు అని.. దాని కి ఎలాంటి మూలాలు లేకుండా, సాక్ష్యాధారా లు లేకుండా బోడిగుండుకు మోకాలికి ముడివేసినట్టుగా ఉంది. జగనన్నకు అండగా నిలిచిన వారి పేర్లును రెడ్‌బుక్‌లో రాసుకుని వారినే టార్గెట్‌ చేసి అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్నారు. సిట్‌ అధికారులు చంద్రబా బు, లోకేష్‌ చెప్పింది చెప్పినట్టుగా విని అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారు. చంద్రబాబు మద్యం వ్యాపారాన్ని అక్రమంగా చేసిన వ్యక్తి కాదా!. డిస్టలరీలు, వివిధ రకాలైన బ్రాండ్లు తీసుకొచ్చి ప్రైవేట్‌ ముసుగులో మోసం చేయలేదా?. బెల్టుషాపులు నిర్వహించి గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదా..? దీనిపై ఆయనపై కేసు పెడితే ప్రస్తుతం ఆయన బెయిల్‌ మీదే ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి’ అని అన్నారు.

Back to Top