జగన్ విడుదల కావాలని సర్వమత ప్రార్థనలు

ఆదిలాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డికి బెయిలు రాకుండా ప్రభుత్వాలు కుట్రపన్నాయని, అందుకు టీడీపీ వంత పాడుతోందనీ ఆరోపిస్తూ జిల్లావ్యాప్తం గా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జగన్‌కు బెయిల్ రావాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఆదిలాబాద్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బి. అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. నిర్మల్‌లో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్ముల వినాయక్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీపార్కులో గాంధీ విగ్రహం ఎదుట కళ్లకు నల్లగుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. సిర్పూర్(టి) మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి యాదగిరి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. మసీదులో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు షేక్‌చాంద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. భైంసాలో మైనార్టీ సెల్ నాయకుడు మోయినోద్దీన్ ఆధ్వర్యంలో మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. కుంటాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్‌లో నియోజకవర్గ ఇ న్‌చార్జి కోయల్కర్ మోహన్ ఆధ్వర్యంలో స్థానిక కెస్లాపూర్ హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఉట్నూర్ శివరామగురుదత్త సాయి మందిరంలో ఎస్టీ సెల్‌జిల్లా అధ్యక్షుడు ప్రభాస్‌నాయక్ ప్రత్యేక పూజలు చేపట్టారు. జన్నారంలోని పైడిపల్లి హ నుమాన్ ఆలయం, ఖానాపూర్‌లోని సాయిబాబా ఆలయంలో నాయకులు పూజలు నిర్వహించారు. బెల్లంపల్లి రైల్వేస్టేషన్ వద్ద గల కోదండరాం ఆలయం, బెల్లంపల్లి మండలంలోని కాసిరెడ్డిపల్లి శివాలయంలో పట్టణ అధ్యక్షుడు మేకల వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి అర్సం మురళి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెన్నూర్, జైపూర్, జైనూర్ మండలాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించారు.

Back to Top