'జగన్ సిఎం లక్ష్యంగా కృషి చేయండి'

గుంటూరు :

శ్రీ వైయస్‌ జగన్మోహన్రెడ్డిని ‌ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా పనిచేయాలని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు, గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ కో ఆర్డినేటర్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ‌పిలుపునిచ్చారు. తన కార్యాలయంలో పార్టీ నాయకుడు జి. రమణారెడ్డి రూపొందించిన క్యాలెండర్‌ను ఆయన బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు. మహానేత డాక్టర్ వైయస్ ‌రాజశేఖరరెడ్డి అందించిన ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబ‌ర్స్మెం‌ట్ వంటి ప‌థకాలు శ్రీ జగన్ ‌సిఎం అయితేనే సక్రమంగా అమలవుతాయని చెప్పారు.
అన్నిచోట్లా వైయస్‌ఆర్‌ టిఎఫ్‌ శాఖలు:
ప్రతి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌టిఎఫ్ శాఖలను ఏర్పాటు‌ చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్ పిలుపునిచ్చారు. అరండ‌ల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారంనాడు ఏపీ వైయస్‌ఆర్ టీచ‌ర్స్ ఫెడరేష‌న్ జిల్లా‌ శాఖ రూపొందించిన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరిం‌చగా, డైరీని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.

Back to Top