'జగన్‌ సిఎం అయితేనే సువర్ణయుగం సాధ్యం'

శంకర్‌పల్లి (రంగారెడ్డి జిల్లా): మహానేత డాక్టర్ ‌వైయస్‌ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణయుగం మళ్ళీ రాష్ట్రంలో రావాలంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి వల్లే సాధ్యం అని పార్టీ ఎస్సీ సెల్‌ రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ సిద్దేశ్వర్‌ అన్నారు. సువర్ణయుగాన్ని మనం తెచ్చుకోవాలంటే శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత అందరిపైనా ఉందన్నారు. శ్రీ జగన్‌ సిఎం అయితేనే రాష్ట్రంలో కొనసాగుగున్న చీకటి పాలన  పోతుందన్నారు. ‌జిల్లాలోని దొంతన్‌పల్లి, మహరాజ్‌పేట్, ఇరుకుంట, పిల్లిగుండ్ల, గోపులారం తదితర గ్రామాలకు చెందిన పలువురు ఆదివారంనాడు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సిద్దేశ్వర్‌ మాట్లాడారు.

ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అసమర్థంగా కొనసాగుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు, దాన్ని అవిశ్వాసం పెట్టి దించేయకుండా కుమ్మక్కు రాజకీయాలతో మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని సిద్దేశ్వర్‌ అన్నారు. శ్రీమతి షర్మిల ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చి, చాలా మంది నాయకులు వైయస్‌ఆర్ ‌సిపిలో చేరడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు.
Back to Top