జగన్ ప్రజల మనిషి

దండేపల్లి: ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వారి కోసం పాటుపడే నాయకుడు వైయస్ జగనేనని వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మేకల ప్రమీల అన్నారు. వైయస్ జగన్ జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ  లక్సెట్టిపేటలోని ఊత్కూర్ చౌరస్తా నుంచి సమీపంలోని దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణ స్వామి దేవస్థానం వరకు (ఐదు కిలోమీ టర్లు) మహిళా కార్యకర్తలతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగన్ బయటికి రాగానే ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడుతారని చెప్పారు.  ‘మీ కోసం.. వ స్తున్నా’నంటూ యాత్ర చేపట్టిన బాబును చూసి ‘మా కోసం వద్దు..’ అధికారంలో ఉండగా మాకేమి చేశావంటూ ప్రజలు ఛీత్కరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో జగన్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆమె వెంట వైయస్ఆర్ సీపీ జిల్లా కమిటీ సభ్యురాలు దర్శనాల సుశీల, నాయకులు అడ్లూరి లక్ష్మి, దర్శనాల రాజు, చిప్పకుర్తి మల్లవ్వ, ఎస్‌డి.జరీనా, శాహీన్ బేగం, పౌజియా, శనిగారపు సరిత, కమల, సత్తమ్మ, సుమారు 200 మంది మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

గూడెంలో ప్రత్యేక పూజలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డి విడుదలయ్యేలా చూడమని గూడెంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మేకల ప్రమీల పూజలు చేశారు. ఈ నెల 5న బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో.. జగన్‌కు బెయిల్ వచ్చేలా చూడాలని సత్యదేవున్ని వేడుకున్నారు. 

తాజా వీడియోలు

Back to Top