జగన్మోహన్ రెడ్డి విడుదలకు ప్రత్యేక పూజలు

ఆలమూరు, 23 మే 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో వీటిని చేశారు. శ్రీ జగన్ విడుదల కోసం జగ్గిరెడ్డి చేపట్టిన యాత్రకు మద్దతుగా వైయస్ఆర్‌ కాంగ్రెస్  నాయకులు సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్, సీబీఐలు కుమ్మక్కై శ్రీ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టారని వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

Back to Top