జగన్ కోసం విద్యార్థుల సంతకాలు

వర్ని:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ కలిసి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాయని  విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ పంచరెడ్డి చరణ్ చెప్పారు. జగన్ కోసం జనం సంతకం కార్యక్రమాన్ని వర్నిలో చేపట్టారు. ప్రభుత్వ జూనియర్, విజయ జూనియర్ కళాశాలలో విద్యార్థులు  సంతకాలు చేశారు. ఈసందర్భంగా చరణ్ ఆయన మాట్లాడుతూ జగన్ విడుదల కోసం చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు దూరం చేయాలనే..
ఎల్లారెడ్డి : ప్రజలకు దూరం చేయాలనే ఉద్దేశంతోనే శ్రీ  వైయస్ జగన్మోహన్‌ రెడ్డిని జైల్లో పెట్టారని ఆ పార్టీ మండలాధ్యక్షుడు రామాగౌడ్ చెప్పారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా రామాగౌడ్ మాట్లాడారు. బాన్సువాడ పట్టణంలో 350 మంది విద్యార్థులు సంతకాలను ఆయన సేకరించా రు.

Back to Top