జగన్ కోసం పార్టీ శ్రేణుల పూజలు

హైదరాబాద్: జన నేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి విడుదలను కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు పూజలు చేస్తున్నాయి. పాదయాత్రలు చేస్తున్నాయి. హోమాలు చేస్తున్నాయి. చేయనున్నాయి. తమ నేతను ఎప్పుడెప్పడు చూస్తామా అని ఎదురుచూస్తున్నాయి. 
పార్టీ ఐటీ విభాగం ఆదివారం రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ దేవాలయానికి పాదయాత్ర నిర్వహించింది. విభాగం రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన్ రెడ్డి, వందలాది మందితో యాత్ర సాగింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మైసూరారెడ్డి యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. నరసరావు పేటనుంచి కోటప్పకొండకు పాద యాత్ర చేశారు. ఇందులో గుంటూరు జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇది సాగింది. ఈ నెల 26న గుంటూరు చతురావృత గణపతి హోమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి చెప్పారు. ఈ నెల 27న నరసింహకొండకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి ప్రకటించారు.
Back to Top