జగన్‌ కోసం.. ముమ్మరంగా జనం సంతకం

హైదరాబద్‌, 29 డిసెంబర్‌ 2012: జననేత శ్రీ‌ వైయస్ జగన్‌పై తమ గుండెల్లో అభిమానం ఎంతగా నిండి ఉందో రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆ‌ర్ కాంగ్రె‌స్‌ పార్టీ కార్యకర్తలు, ప్రజలు నిరూపిస్తున్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తమ నాయకుడు, వైయస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షు‌డు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని జైలు నుంచి బయటకు రావడానికి వీల్లేకుండా చేస్తున్న వైనం వారిని ఎంత కలిచివేస్తోందో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. ‌'జగన్ కోసం.. జనం సంతకం' పేరిట చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని పార్టీ శ్రేణులు నడుపుతున్న తీరు వారి నిబద్ధతను వెల్లడిస్తోంది. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాక.. నెల్లూరు నుంచి ఇచ్చాపురం వరకూ పెద్ద ఎత్తున ఉద్యమంలా సంతకాలను సేకరిస్తున్నారు. వీటిని రాష్ట్రపతి ప్రణ‌బ్ ముఖర్జీకి తీసుకెళ్ళి ఇచ్చేందుకు సంసిద్ధులవుతున్నారు.

ఆదిలాబాద్: జగ‌న్ కోసం.. జనం సంతకాలు చే‌స్తున్నారు. వైయస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ జగ‌న్‌కు బాసటగా జనం స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. శ్రీ వైయస్ జగన్మోహన్‌‌రెడ్డిపై బనాయించిన కేసులను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిర్మల్‌లో మాజీ ఎంపి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరించారు. మొదట తాను సంతకం చేసి ప్రజల నుంచి సంతకాలను సేకరించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్ముల వినాయక్‌రెడ్డి, అధికార ప్రతినిధి మహిపాల్‌రెడ్డి, బిసి సెల్ కన్వీన‌ర్ అల్లాడి వెంకటరమణ, మున్సిప‌ల్ మాజీ వైస్ ‌చైర్మ‌న్ వాహె‌ద్‌ఖాన్, ఆదిలాబా‌ద్‌ బస్టాండ్ సమీపంలో ప్రచార కమిటీ  నాయకులు అని‌ల్‌కుమార్, సలీం పాషా, శ్రీనివా‌స్‌గౌడ్, ఫారుఖ్ రంజాని, గంగారెడ్డి,  బో‌థ్‌లో మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు, మార్కెట్ కమిటీ చైర్మ‌న్ తుల శ్రీనివా‌స్ ఆధ్వర్యంలో,  మంచిర్యాలలో వై‌యస్‌ఆర్‌సిపి నాయకులు బోడ ధర్మేందర్, పెంట రమే‌ష్, శ్రావ‌ణ్‌గౌడ్‌ సంతకాలు సేకరించారు.

అమలాపురంలో: 
తూర్పు గోదావరి జిల్లాలో రెండు రోజులుగా ఉద్యమంలా సాగుతున్న సంతకాల సేకరణలో సామాన్యులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అమలాపురం హైస్కూల్ సెంట‌ర్‌లో దివంగత మహానేత వైయస్ఆ‌ర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో జన‌ం సంతకం కోసం జనం బారులు తీరారు. పార్టీ జిల్లా కన్వీనర్ కు‌డుపూడి చిట్టబ్బాయి, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు, మాజీ ఎం.పి. ఎజెవిబి మహేశ్వరరావు ఈ శిబిరంలో పాల్గొన్నారు. తునిలో పార్టీ నియోజకవర్గ నేత దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలోను, రాయవరంలో పార్టీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, మాజీ ఎం‌పిపి శిరిపురపు శ్రీనివాసరావు, పి.గన్నవరంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు కొండేటి చిట్టిబాబు, విప్పర్తి వేణుగోపా‌ల్, మందపాటి కిర‌ణ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
Back to Top