గుంటూరు, 26 సెప్టెంబర్ 2012: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి కేసుల నుంచి బయటపడాలని కాంక్షిస్తూ గుంటూరులో బుధవారం గణపతి హోమం నిర్వహిస్తున్నారు. 20 మంది వేద పండితులతో చతురావృత గణపతి హోమం ప్రారంభించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఈ హోమం జరుగుతోంది. ఈ గణపతి హోమాన్ని దర్శించేందుకు వైయస్ అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. <br/>ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ, జైలు నుంచి జగన్ బయటకు రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు, పూజలు చేస్తున్నారని అన్నారు. 26 జీవోలు సబబేనని మంత్రులు చెబుతున్నారని, అలాంటప్పుడు వైయస్ జగన్ ఏ విధంగా దోషి అవుతారని ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ప్రశ్నించారు. అక్రమ కేసుల నుంచి వైయస్ జగన్మోహన్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకుంటున్న పాలనను జగన్ అందిస్తారని అన్నారు.