'జగన్‌ కోసం..' 1,24,36,000 సంతకాలు

హైదరాబాద్: వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టిన ‘జగన్ కోసం‌.. జనం సంతకం’ కార్యక్రమానికి విశేషంగా ప్రజాదరణ వస్తోంది. పార్టీ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్, ‌డి.ఎ. సోమయాజులు ఈ విషయం తెలిపారు. ఆదివారం నాటికి కోటి 24 లక్షల 36 వేల సంతకాలు పూర్తయ్యాయని వారు చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియాతో వారు మాట్లాడుతూ, ప్రజాదరణ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.

‌అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టిడిపిలతో కలిసి సిబిఐ చేస్తున్న నీచమైన కుట్రలను నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఈ సంతకాల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని బాజిరెడ్డి, సోమయాజులు తెలిపారు. త్వరలోనే రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అపాయింట్‌మెంట్ తీసుకొని, ప్రజల నుంచి సేకరించిన సంతకాలను‌ ఆయనకు అందజేయనున్నట్లు చెప్పారు.
Back to Top