ఇది విజయమాల్యా బడ్జెట్

టీడీపీ బడ్జెట్ ఓ బోగస్ బడ్జెట్
గత బడ్జెట్ అంకెలను ఎక్కడా మార్చలేదు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు మంగళం పాడారు
చంద్రబాబు తన అబద్ధాలను నిరంతరం కొనసాగిస్తున్నాడు
అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారుః కాకాని

హైదరాబాద్ః ఏపీ బడ్జెట్ ఓ బోగస్ బడ్జెట్ అని, రాష్ట్ర ప్రజలను మోసం చేసిన బడ్జెట్ అని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, మంత్రి యనమల కనీస సమాచారం ఇవ్వకుండా విజయమాల్యా మాదిరి బోగస్ ఫిగర్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారని ధ్వదమెత్తారు.  బడ్జెట్ కు సంబంధించిన ఆడిట్ అకౌంట్స్ ను అసెంబ్లీలో ఇవ్వకుండా ప్రభుత్వం నేరపూరితంగా వ్యవహరించిందని కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బడ్జెట్  రివైజ్ డ్ ఎస్టిమేట్స్ , 2016-17 బడ్జెట్ ఎస్టిమేట్స్ కు సంబంధించి ...కేపిటల్, రెవెన్యూ రెసిప్స్ లో  ఎక్కడా కూడా అంకెలు మార్చకుండా ఉన్నది ఉన్నట్లు చూపించారని  దుయ్యబట్టారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాబు , 8 సార్లు ఆర్థికమంత్రిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన యనమల .....ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవడంలో అనుభవజ్ఞులేమో గానీ, లోప భూ ఇష్టంగా బడ్జెట్ ను ఇచ్చారని కాకాని ఎద్దేవా చేశారు. నిస్సిగ్గుగా మూడో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు కూడా ...ప్రభుత్వం  ప్రజలకు  ఇచ్చిన  ఏ ఒక్క హామీ గురించి ఆలోచన చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రుణమాఫీ చేయకుండానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేశామని చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు. 87వేల 612 కోట్లు వ్యవసాయ రుణాలుంటే, ఇప్పుడు అవి 95 వేలకోట్లకు చేరుకున్నాయని...బడ్జెట్ ద్వారా ఎన్ని మాఫీ చేస్తున్నారో స్పష్టత ఇవ్వకుండా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం దురదృష్టకరమన్నారు. 
 
చంద్రబాబు మొదటగా సంతకం చేసిన 5 హామీలకే దిక్కులేకుండా పోయిందని కాకాని గోవర్థన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పగటి పూట 9 గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తానని మాట్లాడిన చంద్రబాబు..దాని గురించి బడ్జెట్ లో ఎక్కడా కూడా ప్రస్తావించిన పాపాన పోలేదన్నారు. 
 రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తలేదని తూర్పారబట్టారు. స్వామినాథన్ సిఫార్స్ మేరకు ఎంత ఖర్చు అవుతుందో దానిమీద 50 శాతం అదనపు మద్దతు ధర అన్నాడు. దాని గురించి ఊసేలేదు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ప్రతి జిల్లాలో మెగా పార్కులు అన్నాడు. దానికి గురించి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. డ్వాక్రా మహిళలకు కనీస కేటాయింపులు లేవు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడడమే మానేశారని కాకాని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

నిరుద్యోగుల స్వంయం ఉపాధికి లక్ష నుంచి రూ. 50 లక్షల వరకు ఇప్పిస్తానన్నాడు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అన్నాడు. దాని గురించి మాట్లాడలేదు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఊడబీకుతున్నారు. ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్ లు అందరినీ తొలగించారు. పేదలకు లక్షన్నరతో పక్కా ఇళ్లు అన్నారు. మూడు సెంట్ల భూమి అన్నారు. అదీ లేదు. సీమాంధ్రలో 6 లక్షల ఇళ్ల నిర్మాణం చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. 

గ్యాస్ సిలిండర్ మీద రూ.100 సబ్సిడీ, ప్రతి  నియోజకవర్గానికి  వృద్ధాశ్రమలు, అన్నా క్యాంటీన్లు, 5 రూపాయలకు భోజనం అన్నారు. ఎక్కడా కూడా వాటికి బడ్జెట్ లో నిధులు కేటాయింపులు లేవు. కళాశాల విద్యార్థులకు  ట్యాబ్ లు ఇస్తామన్నారు. అదీ లేదు. శాసనసభ్యుడికో ట్యాబ్లెట్ ఇచ్చి ఇదీ బడ్జెట్ అని చెప్పారుతప్ప విద్యార్థులకు ఏమీ ఇవ్వలేదని కాకాని ఫైరయ్యారు. పిల్లలకు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అన్నారు. ఇంటర్ వరకు ఉచిత బస్ పాస్ అన్నారు. రూ.2 లకే  20 లీటర్ల మంచినీరు ఇస్తామన్నారు. బడ్జెట్ లో వాటి ఊసే లేదు. 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ నాటికి ప్రభుత్వ స్థలాలు అన్నాడు. బీసీలకు ప్రత్యేక బడ్జెట్ అన్నాడు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని కాకాని నిప్పులు చెరిగారు. హాస్టల్ మెస్ చార్జీలు, స్కాలర్ షిప్ లు పెంచుతాన్నాడు. మచ్చుకు కూడా బడ్జెట్ లో వాటి ఊసెత్తలేదు.  కాపులకు రూ. 3 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే మొక్కుబడిగా వాళ్లు ఉద్యమం  చేస్తున్నారని  వేయి కోట్లు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్ ను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి చెబుతూనే ఉన్నారు తప్ప పూర్తి చేసింది లేదు.

ఎన్నికల ముందు చెప్పిన మోసపూరిత సంప్రదాయాన్ని చంద్రబాబు నిరంతరం కొనసాగిస్తున్నారని కాకాని గోవర్థన్ రెడ్డి విమర్శించారు. ఆడబిడ్డలు పుడితే  రూ .20 వేలు ఇస్తానన్నాడు. వారు యుక్తవయసుకు రూ. 2 లక్షలు ఇస్తానన్నాడు. దానికి బడ్జెట్ లో కేటాయింపులే లేవు.   ప్రతి గ్రామానికి తారురోడ్డు, సిమెంట్ రోడ్డు, ఇంటింటికి మరుగుదొడ్లు అన్నారు. కేంద్ర నిధులను చంద్రన్న పేరు పెట్టుకొని వాడుకుంటున్నారు. రుణమాఫీ గురించి ఊసే లేదు. ప్రధాన నగరాల చుట్టూ రింగ్ రోడ్డు అన్నారు. దాని ఊసేలేదు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత అనిచెప్పి విస్మరించారు. 

వాడవాడల చంద్రన్న బాట అని చెప్పి సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్లు కేంద్ర నిధులను వాడుకుంటున్నారు. బుల్లెట్ ట్రైన్ లు అన్నారు. భూమి లేని నిరుపేదలకు భూములు అన్నారు . అదీ లేదు. 60 ఏళ్లు దాటిన బ్రాహ్మణులకు పెన్షన్ అన్నారు. ఎక్కడా వాటి ఊసేలేదు. కవులు, కళాకారులకు గౌరవ వేతనంగా రూ. 5,116లు ఇస్తామన్నారు. దాని గురింటి మాట్లడడమే మానేశారని చంద్రబాబుపై కాకాని ధ్వజమెత్తారు.  డ్వాక్రామహిళలు, రైతులను మోసగించారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పి మరిన్ని బెల్ట్ షాపుల కోసం బడ్జెట్ లో రూ. వేయి కోట్లు కేటాయించారు. 

ప్రభుత్వరంగ కార్పొరేషన్ల ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. వికలాంగులకు, వితంతవులకు వేయి నుంచి 1500 ఇస్తామన్నారు. గత ప్రభుత్వాలు 43 లక్షలకు పైగా పెన్షన్ ఇస్తుంటే...చంద్రబాబు  పెన్షన్లు పెంచాల్సింది పోయి వాటిని 39 లక్షలకు తగ్గించారు. కేవలం తన పార్టీ, పచ్చచొక్కాల దోపిడీకి కొమ్ము కాస్తున్నారు తప్పితే ప్రజల గురించి ఎక్కడా కూడా ఆలోచన చేయడం లేదని కాకాని ఫైరయ్యారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. తన పార్టీ వ్యక్తులకు మాత్రమే  నిధులిచ్చేలా స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ అని చెప్పి జీవో జారీ చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి గురించి కాకుండా చంద్రబాబు తన గురించి, పార్టీ గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నారని ఆగ్రహించారు. చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకునేవిధంగా చంద్రబాబు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని కాకాని శివాలెత్తారు. 
Back to Top