భూదందాను అరికట్టకపోతే.. ఇల్లు కూడా ఉండదేమో..?

విశాఖపట్నం: టీడీపీ నేతల భూదందాను అరికట్టకపోతూ విశాఖలో నివసించేందుకు ప్రజలకు ఇల్లు కూడా ఉండదేమోనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో దోచుకోవడం.. దాచుకోవడమేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌బాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు మరేపని పెట్టుకోకుండా విశాఖను ఇష్టారీతిగా దోచుకుంటున్నారని విమర్శించారు. మూడు సంవత్సరాలు కోట్లాది రూపాయలు సంపాదించుకొని రూ. 5 వేలు ఓటుకు ఇచ్చి నోరు వాయి లేని లోకేష్‌ను సీఎంను చేయాలనే తపన తప్పితే రెండో పనిలేదన్నారు. అందుకనే దోచుకోండి అని పార్టీ నాయకులను ప్రోత్సహిస్తున్నాడన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఆ భూములను పేదలకు పంచివ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top