ఇదిగో దోచుకున్నాం..అదిగో పండగ చేస్తున్నాం..!

పేదల పొట్టగొట్టి పెద్దలతో పండగ...!
ప్రజాధనంతో శంకుస్థాపన భోగం... .!

భూములు దోచుకొని రాజధానిలో పండగ చేసుకుందాం రమ్మని నిర్వాసితులను చంద్రబాబు ఆహ్వానిస్తున్నతీరు హాస్యాస్పదం. పేదల పొట్టగొట్టి లాక్కొన్న భూములను సంపన్నుల చేతిల్లో పెడుతూ పండగకు రమ్మనడం విడ్డూరం. వ్యవసాయం దండగని చెప్పిన చంద్రబాబు...ఇప్పుడు ప్రజలకు పండగ కూడా దండగేనని చెప్పకనే చెబుతున్నాడు. మీ భూములు లాక్కున్నాం ఇంకా మీదగ్గర ఏముందని పండగ చేసుకుంటారన్నరీతిలో వ్యవహరిస్తున్నారు.  పప్పు, ఉప్పు సహా నిత్యవసర ధరల్నీ  పెంచేశాం . ఇకపై మీకు అన్నీ దండగలే తప్ప పండగలుండవన్న విధంగా ప్రవర్తిస్తున్నాడు. 

రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని  పండగలా జరుపుతామంటూ చంద్రబాబు చేస్తున్న ఆరాటం, హడావుడి అంతా ఇంతా కాదు. రైతుల ఇష్టం లేకుండా బలవంతంగా భూములు లాక్కున్న చంద్రబాబు...అక్కడ కట్టేది రాబంధుల రాజధాని అవుతుంది కానీ, ప్రజా రాజధాని కాదని విశ్లేషకులు మండిపడుతున్నారు.  ప్రజాధనాన్ని కొల్లగొట్టి రూ. 400 కోట్ల దుబారా ఖర్చుతో చంద్రబాబు చేస్తున్న ఆడంబరాలు, అట్టహాసాలు... లక్షలాది కోట్లు వెనకేసుకునేందుకేనని విమర్శిస్తున్నారు.  రాష్ట్రాన్ని నిలువునా దోచుకొని విదేశీయుల గుప్పిట్లో పెట్టి కట్టే రాజధాని మాకువద్దని ప్రజలంతా నిలదీయాలని పిలుపునిస్తున్నారు. ప్రభుత్వ దుర్మార్గాన్ని కడిగేయాలని సూచిస్తున్నారు.  

చంద్రబాబు అధికారం చేపట్టి ఏడాదిన్నరవుతోంది. ఇంతవరకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా..రాష్ట్ర ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారు. భూములు కోల్పోయి కర్షకులు, ఉద్యోగాలు పోయి కార్మికులు, నిరుద్యోగంతో యువత, రుణాలు మాఫీ కాక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నలు, నారాయణ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఇలా రాష్ట్రమంతా అల్లాడుతుంటే చంద్రబాబు మాత్రం అవేమీ పట్టకుండా రాజభోగాల్లో మునిగి తేలుతున్నారు. 
Back to Top