ఇదిగో నా రాజీనామా..ఇక ఆట మొదలైంది


నంద్యాల: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నైతిక విలువలు ఉన్న వ్యక్తి అని, ఆయన సూచనల మేరకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఇదిగో నా రాజీనామా..ఇక ఆట మొదలైందని ఆయన టీడీపీ నేతలకు సవాల్‌ విసిరారు. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఆవేÔ¶ పూరితంగా ప్రసంగించారు. శిల్పా  అంటే పొలపనే..దుమ్ము దులపాలంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని నంద్యాల ఓటర్లకు పిలుపునిచ్చారు. శిల్పా చక్రపాణిరెడ్డి ఏమన్నారంటే.. నిన్న టీడీపీకి రాజీనామా చేశాను. ఇవాళ వైయస్‌ జగన్‌ సూచనల మేరకు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నాను. కాస్కోండి. తాను రెండో సారి ఎమ్మెల్సీ అయి 90 రోజులు మాత్రమే అయింది. అయినా నేను స్పీకర్‌ ఫార్మెట్‌లో రాజీనమా లేఖను అందజేస్తున్నాను. చక్రపాణిరెడ్డి మాదిరిగా దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలని చెప్పండి. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నైతిక విలువలు కాపాడిన వ్యక్తిని నేనే. జగనన్న ఆ రోజు ఎక్కడైతే నన్ను దించారో, అక్కడే నన్ను బుజాల మీద ఎత్తుకున్నావు. వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు బస్సు యాత్ర పెట్టాం. అదే ప్రభంజనం మళ్లీ మొదలైంది. ఈ రోజు బుడ్డా రాజశేఖరరెడ్డికి సిగ్గుంటే రాజీనామా చేసి  పోటీకి  రావాలి. భూమన్న, బుడ్డన్న ఇద్దరు వైయస్‌ జగన్‌కు మోసం చేశారు. దోంగలను నమ్మి జగనన్న మోసపోయారు. 2004, 2009లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో వేలాది ఓట్ల మెజారిటీతో గెలుపొందాం. ఇదే మెజారిటీతో మళ్లీ ఉప ఎన్నికల్లో అన్నను గెలిపిద్దాం. భూమా డ్రామా? అనే కొత్త సినిమా రిలీజ్‌ అవుతోంది. చంకన పిల్లలను ఎత్తుకొని కొంప ముంచేందుకు వస్తున్నారు. ఆళ్లగడ్డ కావాలా? బనగానపల్లి అల్లుడు కావాలో మీరే తెల్చుకోండి. జనమే మా దేవుళ్లు. శిల్పా మోహన్‌ రెడ్డికి ఓట్లు వేసి శెట్టిగారు మహానుభావులు, వారికి అన్ని తెలుసు. నవాబులు మా వెంటే ఉన్నారు. ఫరూక్‌ నీకు నీ వార్డులో కూడా ఓట్లు వేయలేదు. నిన్ను మూడు సార్లు ఓడించారు. మా అన్న పుణ్యాన నీకు,ముగ్గురికి ఉద్యోగాలు ఇప్పించారు. సైకిల్‌కు దిక్కులేని వ్యక్తి ఈయన. ఓటుకు రూ.10 వేలు తీసుకోండి. డబ్బులు వాళ్లవి..ఓటు మనకు. శిల్పా ఊరికి నీళ్లు పోశారు. అన్న చీమకు కూడా హాని చేయలేదు. మా మీద మచ్చ ఉంటే మళ్లీ కూడా రాజీనామా చేస్తాం. శిల్పా అంటే ఎన్ని సార్లు అయినా త్యాగం చేస్తాం. చంద్రబాబు నన్ను కూడా నమ్మడు. చక్రపాణిరెడ్డి ఏది మాట్లాyì నా సూటీగా మాట్లాడుతా. నాకు ఆశే లేదు. లోకేష్‌ అన్నట్లు అత్యాశ లేదు. ఆ రోజు టీడీపీని లేపే దిక్కు లేదు. ఆ రోజు ఆ పార్టీని లేపేందుకు కొంప కొల్లేరు అయ్యింది. వైయస్‌ జగన్‌ వద్ద ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆయన మొండోడు. చక్రపాణిరెడ్డి ఎక్కడికి పోతాడు అని ఆయన ధీమా. నామీద వైయస్‌ జగన్‌కు ఎంతో ప్రేమ ఉంది. ఈ రోజు నంద్యాలలో అసత్య ప్రచారం చేస్తున్నారు. మోహన్‌ రెడ్డి కేసులు పెట్టించారట. ఫరూక్‌ వద్ద ఉన్న నరేంద్ర అనే వ్యక్తే కేసులు పెట్టించారు. జిల్లెలలో భూమా నాగిరెడ్డి మత కల్లోలాలు పుట్టించారు. దానికి మంట పెట్టింది ఫరూక్‌. భూమా బతికినప్పుడు ముస్లింలను తిట్టారని చెప్పిన ఫరూక్‌ ..ఈ రోజు భజన చేస్తున్నారు. అఖిల ప్రియ చెప్పినట్లు నంద్యాలలో ఎక్కడ జరిగిందో చపించండి. ఆళ్లగడ్డలో ఎక్కడ అభివృద్ధి చేశారో చూద్దాం.
Back to Top