వైఎస్‌ఆర్‌సీపీని వీడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే కోన రఘుపతి

గుంటూరు:  వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష  పార్టీ అని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లో బలమైన నాయకుడిగా ఎదిగారని గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. తనకు పార్టీ వీడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శనివారం ఆయన బాపట్లలో  విలేకరులతో మాట్లాడారు.  రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పడిన పరిస్థితుల్లో ఒక పక్క జిల్లా ఏర్పాటు చేయాలనే దిశగా ప్రయత్నం, ఆ తరువాత వ్యవసాయ కళాశాల చారిత్రక నేపథ్యం ఉన్న బాపట్ల క ళాశాలను యూనివర్సిటీగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రెండింటినీ సాధించుకునే తీవ్రతను తెలియజేసేందుకు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాననే ఆలోచనను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకున్న పరిచయాలతో నియోజకవర్గ అభివృద్ధికి అందరినీ కలుపుకొని పనిచేస్తున్నట్లు చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top