'12న ప్రవేశపెట్టె బడ్జెట్ పై, 16న ప్రభుత్వాన్ని కడిగి పాడేస్తా'

హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకుండానే చర్చ ముగిసిపోతోందని, 30 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇటువంటిది తాను చూడలేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాక్యలకు స్పందించిన వైఎస్ జగన్ గత సంప్రదాయాల్ని ప్రస్తావించారు. గతంలో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్ మీద చర్చ సందర్భంలో ఏదో ఒక దాంట్లో విపక్ష నేత మాట్లాడతారని, మిగిలిన వాటిలో ఇతర నాయకులతో మాట్లాడటం హుందాతనం అని ఆయన స్పష్టం చేశారు. ఇపుడు కూడా అదే ఆనవాయితీని పాటిస్తున్నానని చెప్పారు. 2013లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి చంద్రబాబు నాయుడు ,  సమావేశాలకు రాలేదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. 12న ప్రవేశపెట్టె బడ్జెట్ పై, 16న ప్రభుత్వాన్ని కడిగి పాడేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Back to Top