వైయస్ఆర్‌ కుటుంబానికి విశేష స్పంద‌న‌

హైద‌రాబాద్‌:  రాష్ట్రంలో కోటి కుటుంబాలు ల‌క్ష్యంగా  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించిన వైయ‌స్ఆర్ కుటుంబానికి ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తుంద‌ని పార్టీ ఎమ్మెల్యేలు వి. క‌ళావ‌తి, ఆదిమూల‌పు సురేష్‌, నారాయ‌ణ‌స్వామి అన్నారు. సోమ‌వారం ప్రారంభించిన వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మానికి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుండ‌టంతో టీడీపీ నేత‌ల‌కు గుబులు మొద‌లైంద‌ని వారు పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ కుటుంబానికి మొద‌టి రోజు రికార్డు స్థాయిలో 4 లక్షల మంది 9121091210 నంబర్‌కు మిస్డ్‌కాల్స్ ఇచ్చార‌న్నారు. వీరంతా కూడా  వైయ‌స్ఆర్‌ కుటుంబంలో సభ్యులుగా చేరార‌ని తెలిపారు.  ఈరోజు సాయంత్రం 4.30 గంటల వరకూ 4లక్షల మంది పార్టీలో సభ్యత్వం కోసం రిజిస్టర్‌ అయ్యార‌ని వివ‌రించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి  స్వర్ణయుగాన్ని మళ్లీ 
 తీసుకొచ్చేందుకు, చంద్రబాబునాయుడు దుష్ఫరిపాలనను ఎండగట్టేందుకు ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి మనిషినీ కలిసి చంద్రబాబు పరిపాలన వైఫల్యాలను, వాగ్దానాలను నెరవేర్చకపోవటం ద్వారా చేసిన మోసాలను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు
ఈ కార్యక్రమంలో వివరిస్తున్నార‌ని తెలిపారు. రాష్ట్ర ప్రజలు తమ కష్టనష్టాలను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ దృ
ష్టికి తీసుకురావాలని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నామ‌న్నారు. డిజిటల్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా కూడా ఠీఠీఠీ.yటటజుu్టuఝb్చఝ.ఛిౌఝ కు లాగాన్‌ అయ్యి వైయస్ ర్‌ కుటుంబంలో సభ్యులుగా చేరే అవకాశాన్ని పార్టీ కల్పించిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఉలిక్కిప‌డ్డ టీడీపీ
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని ప్రకటించగానే టీడీపీ నేత‌లు ఉలిక్కిపడ్డార‌ని ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు,
ఇతర నాయకులతో ఇంటింటికీ తెలుగుదేశం అంటూ రోడ్డుమీదకు రావాల్సి వచ్చిందన్నారు. వేల కోట్ల
మేరకు మూడున్నరేళ్ళుగా ప్రచారానికి ఖర్చుపెట్టినా, వేల అబద్ధాలు చెప్పినా ఈ రోజు
తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేకపోవటం వల్లే బాబు దండు దిక్కు తోచక ఇప్పుడు
ఇళ్ళమీద పడి డ్రామాలాడుతోంద‌ని ఫైర్ అయ్యారు.  మూడున్నరేళ్లుగా ప్రజలకు చేసిన అన్యాయాలను
ఎక్కడికక్కడ వైయస్ ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు వివరిస్తుంటే, వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి 
నాయకత్వంలో నవరత్నాలతో మళ్ళీ అందరికీ మేలు చేసే పరిపాలన వస్తుందని ప్రజలు
విశ్వసిస్తున్నార‌న్నారు. ఈ ప‌రిణామాల‌ను చూసి తెలుగుదేశం పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయ‌న్నారు.  ఇచ్చిన ఏ ఒక్క హామీని
నిలబెట్టుకోని బాబు ప్రభుత్వం ఇప్పుడు ఇంటింటికీ ఏ మొహం పెట్టుకుని వెళుతుందని ప్ర‌శ్నించారు.  స్కాంలే
తప్ప స్కీముల్లేని పార్టీ కాబట్టే.., ఇంటింటికీ, మనిషి మనిషికీ అన్యాయం చేయడం తప్ప
పథకాలు అందించలేని పార్టీ గా మిగిలింద‌న్నారు. అందుకే  ఈరోజున ప్రజలవద్దకు వెళ్లి ఇంటింటికీ వివరణ ఇచ్చుకునే
దుస్థితిలో టీడీపీ ఉంద‌ని ఎద్దేవా చేశారు. ఇప్పుడు టీడీపీ క్షమాపణలు చెప్పినా రాష్ట్రప్రజలు  వారి తప్పుల్ని
క్షమించే దశ దాటిపోయిందని తెలిపారు.  

Back to Top