ఊరు వాడా ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’- రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం
- న‌వ‌ర‌త్నాల‌పై విస్తృత ప్ర‌చారం
- గ‌డ‌ప గ‌డ‌ప‌కూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్తున్న పార్టీ శ్రేణులు
 అమరావతి: ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ అనే నినాదంతో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకారం చుట్టిన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన వస్తుంది. ఊరు వాడా రావాలి జ‌గ‌న్‌..కావాలి జ‌గ‌న్ అంటూ నిన‌దిస్తోంది. వైయ‌స్ఆర్‌సీపీ  అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ  ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరించడంతో పాటు, టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రతీ గడపకు వెళ్లి ప్రజలను జాగృతం చేస్తున్నారు.

-  వైయ‌స్ఆర్‌ జిల్లా చిట్వేలు మండలం నాగవరం వడ్డేపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో గడపగడపకు ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మండల కన్వీనర్‌ శ్రీనివాస్‌రెడ్డితోపాటు పెద్ద ఎత్తున​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిథున్‌రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి 60 కుటుంబాలు వైయ‌స్ఆర్‌  సీపీలో చేరాయి.

- విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 27వ డివిజన్‌ హరిజనవాడలో వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్‌, విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు ఇక్బాల్‌ ఆధ్వర్యంలో ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైయ‌స్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల ద్వారా జరిగే లబ్ధి ప్రజలకు వివరించడంతోపాటు, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్ళారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు ఆంజనేయరెడ్డితోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

- విజయవాడ తూర్పు నియోజకవర్గం 24వ డివిజన్‌ కృష్ణలంకలో వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త యలమంచిలి రవి ఆధ్వర్యంలో ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా  వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు వైయ‌స్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల ద్వారా జరిగే లబ్ధి ప్రజలకు వివరించడంతోపాటు, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్ళారు.

-  కృష్ణా జిల్లా ఏ కొండూరు మండలంలోని పాత కొండూరులో  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత నాలుగేళ్లుగా టీడీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె అడిగి తెలుసుకుంటున్నారు. వైయ‌స్‌ జగన్‌ ప్రవేశపెట్టిన నవరత్నాల కరపత్రాన్ని ప్రజలకు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నరెడ్ల వీరారెడ్డి, నియోజకవర్గ బూత్‌ కన్వీనర్ల అధ్యక్షులు వెంకటేశ్వరారెడ్డి, జడ్పీటీసీ ఆంజనేయులు, భూక్యా ఘనీయ, ఎంపీటీసీ చంద్రమోహన్‌, జూపల్లి రాజేష్‌, వెంకటరెడ్డి పాల్గొన్నారు.

- కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్‌ ఇందిరమ్మ కాలనీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో గ్రామ పార్టీ కన్వీనర్‌ అడపా వెంకయ్యనాయుడు, మండల మహిళ అధ్యక్షురాలు రాణి, చలపతి, నాగిరెడ్డితోపాటు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

- కృష్ణా జిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వ‌ర్యంలో రావాలి జ‌గ‌న్‌..కావాలి జ‌గ‌న్ అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే న‌వ‌ర‌త్నాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. 

- పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి మండలం చింతంపల్లిలో జరిగిన ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ చింతపూడి కన్వీనర్‌ ఎలిజా, జానకి రెడ్డి, తాండ్ర రామకృష్ణ, రావు హరిబాబు, చంద్ర‌ శేఖర్‌ పాల్గొన్నారు.

- పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం కొమదవోలు, పాలగూడెం గ్రామాల్లో జరిగిన రావాలి ‘జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్‌ కన్వీనర్‌ కోటగిరి శ్రీధర్‌లతోపాటు, సిటీ కన్వీనర్‌ బొద్దాని శ్రీనివాస్‌, ఉభయ గోదావరి జిల్లాల మహిళా కన్వీనర్‌ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మీ, మంచెం మైబాబు పాల్గొన్నారు. 

- శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం రేగులపాడులో టెక్కలి వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ పాల్గొన్నారు.

-  గుంటూరు జిల్లా మంగళగిరిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఆధ్వ‌ర్యంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన చేనేత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

- నెల్లూరు జిల్లా ఓజిలి మండలం ఆచార్లపార్లపల్లి, కొండవల్లిపాడు, మానమాల గ్రామాల్లో సూళ్లూరుపేట  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ గుంటమడుగు రవీంద్రరాజు, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌ రెడ్డి, దేసిరెడ్డి మధుసూదన్‌ రెడ్డి, ఉచ్చురు హరినాథ్‌ రెడ్డి, పాదర్తి హరనాథ్‌ రెడ్డితో ఇతర నాయకులు పాల్గొన్నారు.

-  అనంతపురం జిల్లా కనేకల్‌ మండలంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మొద్దులపల్లిలో ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమంలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఇంటింటికి తిరుగుతూ నవరత్నాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

-  అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలో పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన ప్రజలకు నవరత్నాల గురించి వివరించారు. 

- తిరుపతి ఇందిరా నగర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో ఇంటింటికి తిరుగుతూ.. ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని చేపట్టారు.

- చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలం అదవరంలో  వైయ‌స్ఆర్‌సీపీ నేత గవర్ల కృష్ణయ్య ఆధ్వర్యంలో ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో పార్టీ సమన్వయకర్త కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. 

- విశాఖ వి మాడుగుల మండలం తాటిపత్రిలో  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ముత్యాలనాయుడు ఇంటింటా తిరుగుతూ.. నవరత్నాల ద్వారా జరిగే లబ్ధిని గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున​ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Back to Top