హైదరాబాద్: విజయవాడ రోడ్డు రవాణా సంస‍్థ (ఆర్‌టీఏ) కమిషనర్‌పై దాడికి పాల్పడిన ఘటనలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఓ దినపత్రికలో వచ్చిన కథనాలను పిల్‌గా స్వీకరించిన హైకోర్టు కేసును సూమోటోగా స్వీకరించింది. దీనిపై మంగళవారం విచారణ జరిపింది. ప్రతివాదులు 11 మందికి నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వర్ రావు, మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ఏపీ డీజీపీ ,విజయవాడ సీపీల తదితరులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.