తిరుమలను హెరిటేజ్ తిరుమలగా మార్చుతారేమో?

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలను తన వ్యాపారాలకు వాడుకోవడం దారుణమని  చిత్తూరు జిల్లా చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల కొండపై హెరిటేజ్ పార్లర్ కు అనుమతులు ఎలా ఇచ్చార ని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తిరుమలను తన జేబు సంస్థగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని  విమర్శించారు. టీటీడీ అధికారులు కూడా బాబుకు వంత పాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తిరుమల పేరును కూడా హెరిటేజ్ తిరుమలగా మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెవిరెడ్డి అన్నారు.
Back to Top