<strong>హైదరాబాద్, 2 డిసెంబర్ 2012:</strong> మరి కొద్ది రోజుల్లో పంటలు చేతికి రానున్న సమయంలో అనంతపురం జిల్లా రాయదుర్గంలోని హైలెవెల్ కెనాల్ (హెచ్‌ఎల్‌సి)కు అర్ధంతరంగా నీటిని నిలిపివేయడం దారుణమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, కిరణ్ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఈ ప్రభుత్వం చర్యలు అన్నదాతలను ఆత్మహత్యలకు పురికొల్పే విధంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. హెచ్‌ఎల్‌సికి తక్షణమే సాగునీటిని సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కాపు రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.