పుష్క‌రాల పేరుతో భారీ దోపిడీ

భ‌క్తి, విశ్వాసంతో పుష్క‌రాల‌ను నిర్వ‌హించ‌డం లేదు
దోపిడీ కోస‌మే కృష్ణా పుష్కరాల ప‌నుల ఆల‌స్యం
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి

హైదరాబాద్ః చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గోదావ‌రి, కృష్ణా పుష్క‌రాల పేర భారీ దోపిడీ చేస్తోందని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి నిప్పులు చెరిగారు. పుష్క‌రాల‌ను భ‌క్తితో, విశ్వాసంతో నిర్వ‌హించ‌డం లేద‌ని, కేవ‌లం డ‌బ్బుల‌ను దోచుకునేందుకే పుష్క‌రాలు అన్న‌ట్లు బాబు సర్కార్ ప‌నితీరు ఉంద‌ని విమర్శించారు. గోదావ‌రి పుష్క‌రాల‌ను ఎక్క‌డ లేని విధంగా ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌న్న ప్ర‌భుత్వానికి వారు చేసిన ఏర్పాట్ల‌కు త‌ర్ప‌నం ప‌ట్టే విధంగా దుర్ఘ‌ట‌న జ‌రిగింద‌న్నారు. బాబు ప‌బ్లిసిటీ పిచ్చి వ‌ల్ల గోదావ‌రి పుష్క‌రాల్లో 29 మంది ప్రాణాలు పోయాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ ఏమన్నారంటే...

 • చంద్ర‌బాబు, ఆయ‌న కుటుంబ స‌భ్యులు సామాన్య భక్తుల ఘాట్ లకు రావ‌డం మూలంగానే గోదావరిలో తొక్కిస‌లాట జరిగింది.
 • గోదావ‌రి పుష్క‌రాల పేరుతో 29మందిని బాబు బ‌లితీసుకొని, రూ. 1600 కోట్ల దోపిడికి పాల్ప‌డ్డారు
 • బాబు వ‌ల్లే ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింద‌ని అప్ప‌టి క‌లెక్ట‌ర్ రాష్ట్ర‌ప‌తికి, జాతీయ మానవ హ‌క్కుల క‌మిష‌న్‌కు నివేదిక సమర్పించారు.
 • త‌ర్వాత బాబు ఒత్తిడి మేర‌కు మ‌రో నివేదిక‌ను ఇచ్చారు. 
 • గోదావ‌రి పుష్క‌రాల్లో  29మంది చ‌నిపోతే... కృష్ణ పుష్క‌రాలు ప్రారంభం కాక‌ముందే 30 దేవాల‌యాల‌ను బాబు కూల్చేశారు. 
 • పుష్క‌ర దోపిడీపై చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాలి
 • కోట్లాది మంది ప్రజ‌లు భ‌క్తితో, విశ్వాసంతో పుష్క‌ర సాన్నాన్ని ఆచరిస్తారు.
 • కానీ ఏపీలో మాత్రం గోదావ‌రి నీళ్ల‌ను పుష్క‌రాల సంద‌ర్భంగా కృష్ణ‌ాలో క‌లుపుతున్నార‌న్న అపోహ ప్ర‌జ‌ల్లో ఉంది
 • పుష్క‌రాల‌పై ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి లోపించింది.
 • కృష్ణ‌ాన‌దిలో నీటిమ‌ట్టం త‌క్కువ‌గా ఉన్న సంద‌ర్భంలో చంద్ర‌బాబు కృష్ణా న‌దిజ‌లాల బోర్డుతో మాట్లాడి నాగార్జున‌సాగ‌ర్‌, శ్రీ‌శైలం నుంచి నీటిని విడుద‌ల చేయాల‌ని క‌నీసం లేఖ కూడా రాయ‌లేదు.  ఇది చాలా దుర‌దృష్టకరం.
 • చంద్ర‌బాబుకు హిందూ సంప్ర‌దాయాలు, పుష్క‌రాల‌పై విశ్వాసం లేదు
 • ప‌నుల‌ను కావాలనే ఆల‌స్యం చేయ‌డం... ఆ త‌ర్వాత స‌మ‌యం లేదు  ఎవ‌రికైనా అప్ప‌గించాలని నిర్ణయం తీసుకోవడం అంతా పథకం ప్రకారమే చేస్తున్నారు. 
 • కృష్ణా పుష్క‌రాలు అన‌గానే విజ‌య‌వాడ దుర్గ‌ఘాట్ అంద‌రికీ గుర్తుకు వ‌స్తుంది. 
 • అటువంటి ఘాట్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు ప్రారంభించ‌లేదు.
 • ఒక కార్యక్ర‌మం చేసిన‌ప్పుడు ముందుగానే అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఆలోచ‌న చేయాలి
 • దుర్గ‌మ్మ గుడిప‌క్క‌నే దాదాపు రూ. 150 కోట్ల‌తో నిర్మించాల్సిన దుర్గ‌ఘాట్‌ను కావాల‌నే ఆల‌స్యం చేశారు
 •  బాబు బినామీలు అవినీతికి పాల్ప‌డ‌డం కోస‌మే ఇదంతా
 • ఇరిగేష‌న్ శాఖ మంత్రి దుర్గ‌గుడికి కూత వేటు దూరంలో ఉంటాడు... అటువంటి మంత్రికి పుష్క‌రాల ప‌నుల‌పై అవ‌గాహ‌న లేక‌పోవ‌డం సిగ్గు చేటు
 •  ముఖ్య‌మంత్రి, ఇత‌ర మంత్రులు సైతం విజ‌య‌వాడ‌లోనే స‌మావేశాలు నిర్వ‌హించుకుంటారు... అప్పుడైనా పుష్క‌రాల ప‌నులు గుర్తుకు రాలేదా..?
 • పంటలను సాగు చేయాల్సిన ఇరిగేషన్ శాఖ అవినీతిని సాగు చేస్తోంది.  దీనికి వారు స‌మాధానం చెప్పాలి
 • రూ. 35 కోట్ల ప‌నులు ముందు ప్రారంభించి త‌ర్వాత అడ్మినిస్ట్రేటివ్ కు పంపించ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏమిటో బాబు చెప్పాలి
 • బాబు పాల‌న తీరు వ‌ల్ల అధికారులు భ‌య‌ప‌డుతున్నారు.
 • ఒక‌వైపు ఎండోమెంట్ శాఖ‌కు చేతి ఖ‌ర్చుల‌కు రూ. 50 కోట్ల ఇస్తూ మ‌రోప‌క్క నిధులు లేవంటారు
 • రూ. 50 కోట్లు మంజూరు చేస్తే అనంత‌రం ఏదో ఒక విధంగా దోచుకోవ‌చ్చ‌న‌ది టీడీపీ ఆలోచ‌న‌
 • ప‌ట్టిసీమ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 75 కోట్ల తో ప‌బ్లిసిటీ చేశారు
 • ఇప్ప‌టికే పుష్క‌రాల పేరుతో చాలా దోపిడీ చేశారు
 • ఈ  దోపిడీపై విజిలెన్స్‌, సిబిసీఐడీతో విచార‌ణ జ‌రిపించాలి.
 • ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, విశ్వాసం లేని త‌నం స్ప‌ష్టంగా క‌నబ‌డుతుంది.
Back to Top