పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తా

ఒంగోలు నూత‌న మైనార్టీ సెల్ అధ్య‌క్షుడు మీరావ‌లి
ఒంగోలు: ఒంగోలు ప‌ట్ట‌ణంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని పార్టీ న‌గ‌ర మైనార్టీ సెల్ అధ్య‌క్షుడిగా నియ‌మితులైన షేక్ మీరావ‌లి అన్నారు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారికి పార్టీలో ఎల్ల‌ప్పుడు గుర్తింపు ల‌భిస్తోంద‌ని అన్నారు. ఒంగోలు న‌గ‌ర మైనార్టీ సెల్ అధ్య‌క్షుడిగా నియ‌మితులైన మీరావ‌లిని ప‌లువురు నేత‌లు ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా మీరావ‌లి మాట్లాడుతూ త‌న‌ను న‌మ్మి మైనార్టీ సెల్ అధ్య‌క్షుడిగా నియ‌మించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా అధ్య‌క్షుడు బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డిల‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కిందిస్థాయి నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను క‌లుపుకుపోతూ పార్టీ ప‌టిష్ట‌త‌కు కృషి చేస్తాన‌ని చెప్పారు. రాబోయే 2019 ఎన్నిక‌ల్లో పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని సీఎం చేసుకొని తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. త‌న‌కు ప‌ద‌వి రావ‌డానికి స‌హ‌క‌రించిన వేమూరి బుజ్జి, శింగ‌రాజు వెంక‌ట్రావుల‌కు మీరావ‌లి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 
Back to Top