పాశర్లపూడి వంతెనపై రాజన్న బిడ్డకు ఘన స్వాగతం


తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలాపురం నియోజకరవ్గంలోని పాశర్లపూడి వంతెనపై నడిచారు. ఇక్కడికి రాగానే జననేతకు పార్టీ శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ వంతెనకు 2006లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. పాశర్లపూడి వంతెన వద్దకు రాగానే స్థానికులు రాజన్న బిడ్డపై పూలవర్షం కురిపించారు.  వైయస్‌ జగన్‌ వెంట గోదావరి జిల్లా ప్రజలు కదం తొక్కుతున్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలతో ప్రతి ఇల్లు కళకళలాడుతుందని విశ్వసిస్తున్నారు. సంక్షేమ పథకాలకు వైయస్‌ జగన్‌ ప్రాణం పోస్తారని ప్రజలు చెప్పుకుంటున్నారు. ప్రజల కోసం మడమ తప్పని పోరాటం చేస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు. తమ కష్టాలు తెలుసుకునేందుకు వచ్చిన జననేతను ప్రజలు స్వచ్ఛందంగా కలిసి బాధలు చెప్పుకుంటున్నారు.
 
Back to Top