ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ప్ర‌భుత్వం విఫ‌లం

సోంపేట: ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఇచ్చాపురం నియోజక వర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త నర్తు రామారావు అన్నారు. బారువ మేజర్‌ పంచాయతీలో మంగళవారం వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బారువ జంక్షన్‌ వద్దనుంచి ,బారువ తీరప్రాంతంలోని రిసార్ట్స్‌ వరకు రహదారి పూర్తిగా పాడైపోయి ఉన్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వేలాది మంది పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నా కనీస స్పందన లేదన్నారు. డ్వాక్రా మహిళలను, రైతులకు, మత్స్యకారులకు అమలు కాని హమీలు ఇచ్చి ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షుడు తడక జోగారావు, జిల్లా కార్యదర్శి మడ్డు రాజారావు, కవిటి మాజీ ఎంపీపీ నర్తు చామంతి, బారువ సర్పంచ్‌ యర్ర తారకేశ్వరారవు, పార్టీ నాయకులు తెప్పల దర్మారావు, చంద్రశేఖర్,సత్యం పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top