గోపాలపురం చేరనున్న షర్మిల పాదయాత్ర

రావికంపాడు, 17 మే  2013:

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో శుక్రవారం నాడు శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం సాగనుంది. 151వ రోజు పాదయాత్రను శుక్రవారం ఉదయం ఆమె కొత్త వెంకటాపురం నుంచి ప్రారంభించారు. అక్కడ్నుంచి పాత వెంకటాపురం, ఎడవల్లి, మీదుగా దొరసానిపాడు వరకు పాదయాత్ర సాగుతుంది. ఇవాళ 12.5 కిలో మీటర్ల మేర పాదయాత్ర జరగనుంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల గురువారం నాడు  2000 కి.మీ. పాదయాత్ర పూర్తిచేసిన సంగతి తెలిసిందే.

Back to Top