నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు

గొల్లప్రోలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవనత్నాల పథకంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని  నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ పెండెం దొరబాబు అన్నారు. మండలంలోని ఏకే మల్లవరంలో వైయ‌స్ఆర్‌  కుటుంబం కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా సుబ్రహ్మణ్యస్వామి గుడిలో పూజాధికార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండల కన్వీనర్‌ అరిగెల రామయ్యదొర ఆధ్వర్యంలో గ్రామంలో వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటా నవరత్నాలను వివరించారు. వైయ‌స్ జగన్‌ సీఎం అయితే చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమపధకాలను తెలియచేశారు. మాటమీద నీలబడే వ్యక్తి వైయ‌స్ జగన్ అని ప్రజలకు నొక్కి చెప్పారు. చంద్రబాబు చేసిన మోసాలను , ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వైనాన్ని వివరించారు.  కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ అరిగెల మణిబాబు, వింజరపు బుల్లిబాబు, మణుగుల వీరబ్రహ్మం, పాలపర్తి సూరయ్య, తటవర్తి నందీశ్వరరావు, సిద్దా అప్పారావు, పులుగు చంద్రరావు, బోడపాటి నూకరాజు, కూరాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


ఏపీ మల్లవరంలో:
ఏపీ మల్లవరంలో వైయ‌స్ఆర్‌కుటుంబం కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ దొరబాబుతో పాటు జిల్లా కార్యదర్శి కడిమిశెట్టి కుమారభాస్కరరెడ్డి, సర్పంచ్‌ గంపల మార్త తదితరులు గంటింటా తిరిగి నవరత్నాల కరపత్రాలను పంచుతూ పథకాన్ని వివరించారు. ఈసందర్భంగా దొరబాబు మాట్లాడుతూ నియోజకవర్గవ్యాప్తంగా వైఎస్సార్‌కుటుంబం కార్యక్రమం ఉద్యమంల చేపడుతున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తుందన్నారు. బూత్‌కమిటీ కన్వీనర్లు, సభ్యులు ఇంటింటా తిరిగి నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళతున్నారని తెలిపారు.  

చెందుర్తిలో:
చెందుర్తిలోని 7,8పోలీంగ్‌ బూత్‌లు పరిధిలో వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు కోనేటి పెదకాపు, లచ్చబాబు, అల్లు నూకరాజు తదితరులు ఎస్సీపేట, గొల్లపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటా నవరత్నాలును వివరించి పలువుర్ని వైయ‌స్ఆర్‌ కుటుంబంలో చేర్పించారు. 


Back to Top