'గిరిజనులు వైఎస్ విగ్రహాలుపెట్టి పూజిస్తున్నారు'

హైదరాబాద్: దళిత వర్గాలను అక్కున చేర్చుకున్న దివంగత వైఎస్‌కి తామంతా వారసులమేనని, మీకు చేతనైతే ఆయనలా ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సవాలు విసిరారు. ‘20.6 లక్షలమంది గిరిజనులకు పట్టాలిచ్చారు. 6.5 లక్షలమందికి ఇళ్లు కట్టించారు. అందుకే గిరిజనులు వైఎస్ విగ్రహాలుపెట్టి పూజిస్తున్నారు. ఇవన్నీ మీరు కూడా చేతనైతే చేసి చూపించండి.  ఐకేపీలో అక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యేగా సంతకాలు పెట్టిచ్చినా విచారణ లేదు. బహిరంగంగా ఖనిజ సంపదను తవ్వుతామని బెదిరిస్తున్నారు. దీన్ని గిరిజన ఎమ్మెల్యేలందరం అడ్డుకుని తీరతాం. అవసరమైతే పోరాటానికి సిద్ధమే’ అని  అన్నారు. కాగా బీసీలను ఓటు బ్యాంకుగా మార్చిన చంద్రబాబుకు బీసీ సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు.
Back to Top