ప్ర‌తిష్టాత్మ‌కంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్సీపీ

హైద‌రాబాద్‌) వైయస్సార్సీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్సీపీ కి నేటి నుంచి శ్రీకారం చుడుతున్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో సంక్షేమ పథకాల ప్రదాతగా నిలిచి పోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీన దీనికి శ్రీకారం చుడుతున్నారు. గడప గడపలో ఒకే నినాదం-వైఎస్సార్ కాంగ్రెస్, ఇది తెలుగు ప్రజల నమ్మకానికి ప్రతిరూపం’ అనే శీర్షికన ముద్రించిన నాలుగు పేజీల కరపత్రాన్ని ఈ సందర్భంగా ఇంటింటికీ పంపిణీ చేస్తారు. ఈ కరపత్రంలో ఎన్నికలపుడు (2014) చంద్రబాబు చేసిన వాగ్దానాలు, వాటిని నెరవేర్చలేకపోయిన వైనం వివరించారు. అంతే కాదు, చంద్రబాబు పాలన పాసా? ఫెయిలా? ప్రజలే నిర్ణయించాలని కోరుతూ ఇదే కరపత్రంలో వంద ప్రశ్నలతో ఒక బ్యాలట్‌ను కూడా పొందుపర్చారు. 
 జూన్ 14వ తేదీన విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విసృ్తత సమావేశంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించిన దరిమిలా ఈ నెల 4న హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ జనాదరణను పొందడానికి, ప్రజా మద్దతు పొందడానికి ఈ కార్యక్రమం ఎంత ముఖ్యమైనదో జగన్ ఈ సమావేశంలో వివరించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి కుగ్రామానికి, ప్రతి గడపకూ పార్టీ కార్యకర్తలు వెళ్లాలని సూచించారు. ‘పార్టీ అధ్య‌క్షుల వారి ఆదేశాల మేర‌కు పార్టీ శ్రేణుల‌న్నీ గ్రామాల‌కు త‌ర‌లుతున్నాయి. 
Back to Top