ప్రజలను మభ్యపెట్టేందుకే విదేశీ పర్యటనలుఃశ్రీకాంత్ రెడ్డి

హైదరాబాద్ః హరితాంధ్రప్రదేశ్ లో వ్యవసాయం లేకుండా చేస్తూ చంద్రబాబు రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. 

 రాష్ట్రంలో అవినీతి పెట్రేగి పోతుందని ధ్వజమెత్తారు. బాబు సొంత ప్రయోజానాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను విదేశాలకు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనల పేరుతో బాబు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దేశంలోని పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించకుండా పెట్టుబడుల పేరుతో విదేశాలు తిరగడంలో ఆంతర్యమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.  ఇప్పటివరకు రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.  బాబు ఫారెన్ టూర్ లపై కేంద్రం దృష్టి సారించాలన్నారు.  
Back to Top