బాబు మమ్మల్ని రోడ్డున పడేశాడు

ప్రొద్దుటూరు:

ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 8,500 మందిని ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా నియమించి రూ. 6 వేల జీతమిస్తే.. చంద్రబాబు రాగానే మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించారని సమస్యను జననేతకు చెప్పారు. 11 ఏళ్లుగా పనిచేస్తున్న మమ్మల్ని చంద్రబాబు రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే మాకు న్యాయం చేయాలని ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు వైయస్‌ జగన్‌ను కోరారు. 

Back to Top