'ఫీజు'పై 6,7 తేదీల్లో విజయమ్మ నిరశనదీక్ష

హైదరాబాద్, 1 సెప్టెంబర్‌ 2012 : ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమరభేరీ మోగించారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ అమలులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆమె ఈ నెల 6,7 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిరాహార దీక్ష చేయనున్నారు. పేద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని, అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని వైయస్ విజయమ్మ శనివారం డిమాండ్ చేశారు.

Back to Top